వ్యాపార సూత్రం: (కోటీశ్వరుడు సూత్రం)
ఈ ఆర్టికల్ లో ప్రతీ వ్యాపార వ్యక్తి యొక్క కోట్లు సంపాదన వెనుక ఉన్న సూత్రాన్ని తెలుసుకుందాం.
ఒక వ్యక్తి కానీ ఒక సంస్థ కానీ వ్యాపారంలో విజయం సాధించాలంటే ఖచ్చితంగా ఈ సూత్రాన్ని పాటించాలి. ఇదే అతి పెద్ద సూత్రం. దీనికి మీది ఎంత చిన్న వ్యాపారం ఎంత పెద్ద వ్యాపారం అని అవసరం లేదు.
ఉదాహరణకు రెండు వ్యాపార వ్యక్తులను తీసుకుందాం. ఇద్దరు కొవ్వొత్తుల వ్యాపారం మొదలుపెట్టారు అనుకుందాం. సహజంగా ప్రతి ఒక్కరు వారు మొదలుపెట్టే వ్యాపారం గురించి లాభ నష్టాలూ, అవసరాలు, ఇవన్నీ ముందుగా కనుక్కొంటారు.
100 కొవ్వొత్తులు తయారు చేసారు అనుకుందాం. 100 కొవ్వొత్తులు తయారీకి 160 రూపాయలు అయింది అనుకుందాం.
ఒక్కో కొవ్వొత్తుకు 1.60 పైసలు చొప్పున = 160 /-
అమ్మకం = 200 /-
లాభం = 40/-
ఈ విధంగా రోజుకి 1000 కొవ్వత్తులు వ్యాపారం చేస్తే రోజుకి 400 లాభం.
ఇక్కడే చిన్న వ్యాపారికి కోటీశ్వరుడికి మధ్య వ్యత్యాసం తెలుస్తుంది. చిన్న వ్యాపారి తనకి రోజుకి 400 వస్తున్నాయి కదా అని తృప్తి చెంది ప్రతి రోజు అదే లాభం వచ్చే విధంగా చూసుకుంటాడు. దానికి తగ్గట్టుగా కష్టపడతాడు. కానీ అదే వ్యాపారంలో నెలకి కోట్లు సంపాదించే వ్యాపారి మూడు విషయాలు చేస్తాడు.
- బ్రాండింగ్
- డిస్ట్రిబూటింగ్
- మార్కెటింగ్
పైన చెప్పిన 3 విషయాలు సరిగ్గా అమలు చేస్తే ఎవరైనా కోటీశ్వరుడు అవ్వొచ్చు. ఇక్కడ వ్యాపారి
ముందుగా తన కొవ్వోత్తులకి ఒక మంచి పేరు పెట్టుకుంటాడు. ఉదారణకు AI కొవ్వొత్తులు అనుకుందాం. ఇప్పుడు తనకి వచ్చిన లాభం లో కొంత డబ్బులను తీసి తన వ్యాపార బ్రాండ్ పేరును ప్రజలలోకి వెళ్లే విధంగా మార్కెటింగ్ చేస్తాడు. ప్రజలలో ఒక మంచి పేరు వచ్చిన తరువాత తన వ్యాపారాన్ని పెంచుకోవాలి అనుకుంటాడు. అప్పుడే ఎక్కువ మంది distributors ను ఏర్పాటు చేసుకుంటాడు. ఉదాహరణకు 10 డిస్ట్రిబ్యూటర్లు ఉన్నారు అనుకుందాం. ఒక్కో డిస్ట్రిబ్యూటర్ 1000 కొవ్వొత్తులు వ్యాపారం చేసాడు. ఇప్పుడు తనకి వచ్చిన 40 పైసలు లాభాన్ని ఈ డిస్ట్రిబ్యూటర్లతో 20 పైసలు చొప్పున లాభాన్ని పంచుకుంటారు. ఇప్పుడు 20 పైసలు చొప్పున ఒక్కో వ్యాపారి అమ్మిన 1000 కొవ్వోత్తులనుండి అంటే 10 వేల కొవ్వొత్తుల నుండి 2000/- రూపాయలు లాభం వచ్చింది రోజుకి.
ఆ లాభం లో కొంత సొమ్మును మరల యాడ్స్ ద్వారా ఎక్కువ మార్కెటింగ్ చేస్తాడు. కొద్దీ రోజులకి 10 డిస్ట్రిబ్యూటర్స్ కాస్తా 10000 మంది డిస్ట్రిబ్యూటర్లకు పెంచుకుంటాడు దేశవ్యాప్తంగా.
10000 మంది ఒక్కో వ్యక్తి 1000 కొవ్వొత్తుల వ్యాపారం చేస్తే రోజుకి ఒక కోటి కొవ్వొత్తులు అమ్ముడుపోతాయి.
10000*1000 = 1 Cr
1 Cr* 0.20 = 20 లక్షలు
నెలకి 6 కోట్లు లాభం.
ఇదే చిన్న వ్యాపారానికి, కోటీశ్వరుడికి మధ్య వ్యత్యాసం. పైన చెప్పిన సూత్రాన్ని పాటిస్తే ఎవరైనా కోటీశ్వరులు అవుతారు.
[…] వ్యాపార సూత్రం – కోట్లు సంపాదించిపెట… […]